శ్రీకాకుళం గంజాయి కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ బ్లాగ్‌లో తాజా ఘటనలు, పోలీసుల చర్యలు, యువతపై ప్రభావం గురించి తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాలలో గంజాయి వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం గంజాయి కేసులు ఇటీవలి కాలంలో గంజాయి కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాలు, యువత ఉపయోగంలో పడే మార్గాలు, పోలీసుల చాకచక్యంతో పట్టుబడిన సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గంజాయి రవాణాలో పట్టుబడిన ఘటనలు
1. శ్రీకాకుళం గంజాయి కేసుల్లో పలాస వద్ద 18.55 కేజీల గంజాయి స్వాధీనం

2025 మే 14న కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు, సాయంత్రం 6:45 గంటల సమయంలో పలాస రైల్వే స్టేషను సమీపంలో ఒక వ్యక్తి వద్ద సుమారు 18.55 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి, పోలీస్ అధికారి సీఐ సూర్యనారాయణ గారు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి మహారాష్ట్ర పూణేలోని A3కు పంపించేందుకు A1, A2 కలిసి యత్నించగా అరెస్ట్ అయ్యారు.
2. వాండ్రంగి వద్ద 2.3 కేజీల గంజాయి పట్టింపు

ఇక మే 13న (మంగళవారం) జి సిగడాం మండలంలోని వాండ్రంగి రైల్వే బ్రిడ్జి సమీపంలో 2 కేజీలు 300 గ్రాముల గంజాయి స్కూటీలో తీసుకెళ్తున్న ఇద్దరు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశాలోని సుంకి గ్రామం నుండి గంజాయి కొనుగోలు చేసి, శ్రీకాకుళం మీదుగా తరలించడంలో భాగంగా పట్టుబడ్డారు.
శ్రీకాకుళం గంజాయి కేసులు వెనుక ఉన్న కారణాలు
- సరిహద్దు రాష్ట్రం ఒడిశాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉంటుంది.
- ఆ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ లోకి అక్రమ రవాణా చేయడం సులభం కావడం.
- పేద యువత కొంత డబ్బు కోసం ఈ రవాణాలో భాగస్వాములవుతున్నారు.
- సరైన అవగాహన లేకపోవడం మరియు ఉద్యోగాల లేకపోవడం వల్ల సులభంగా మోసపోతున్నారు.
పోలీసుల చర్యలు
“ఇటీవలి శ్రీకాకుళం గంజాయి కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.” శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈ అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక దళాలను నియమించారు. డిఎస్పీ ఎం. వెంకట అప్పారావు గారు నిర్వహించిన పత్రికా సమావేశంలో అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
యువతపై ప్రభావం
గంజాయి వాడకం వల్ల:
- మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
- విద్యాభ్యాసం మరియు ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుంది.
- నేరపూరిత జీవనశైలి వైపు యువత ఆకర్షితమవుతుంది.
మన బాధ్యత
- ప్రతి తల్లిదండ్రి తన పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి.
- స్కూల్స్ మరియు కాలేజీలలో డ్రగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ప్రజలు చురుకుగా పాల్గొనాలి.
మీ ప్రాంతాల్లో జరిగే ఇటువంటి విషయా లను కింద కామెంట్ లో తెలియజేయండి
ఈ శ్రీకాకుళం గంజాయి కేసులు విషయాన్ని అందరికీ తెలియజేయండి మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మన శ్రీకాకుళం ని కాపాడుకునే బాధ్యత మనందరిలోనూ ఉంది ప్రతి ఒక్కరూ ఈ విషయానికి స్పందించి మనమే మార్పు తీసుకురావాలి. మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలుసు కానీ మనకి ఎందుకు….. అని వదిలేస్తున్నారు.
మనం ఈ గంజాయిని వినియోగించకపోయినా మన చుట్టుపక్కలు ఉన్నవాళ్లు వినియోగిస్తున్నారు ఈ విషయాన్ని మనం పోలీసులు ముందు లేదా సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలియజేయాలి మనకు ఎందుకు అని వదిలేయడం కారణంగానే మన శ్రీకాకుళానికి ఈ చెడ్డ పేరు కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దీనికి కారణం ఎవరైనా తెలిస్తే తెలియచేయండి. దీన్ని ఎలా అరికట్టవచ్చు తెలియజేయండి. ఏం చేస్తే దీనంతటిని కంట్రోల్ చేయగలం కింద కామెంట్ లో చెప్పండి మేము స్పందిస్తాము.
Leave a Reply